ఇంటిని మ్యూజియంగా మార్చిన 9 ఏళ్ల బాలిక
- March 09, 2022
మస్కట్: నార్త్ షర్కియాలోని అల్ ఖబిల్ విలాయత్లోని తొమ్మిదేళ్ల బాలిక తమ ఇంటిని మ్యూజియంగా మార్చింది. ఇందులో 90 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నాటి కళాఖండాలు, కుండలను ప్రదర్శనకు పెట్టారు. అర్వా మొహమ్మద్ అల్ మాలికీ తన ఫ్యామిలీ హోమ్ మ్యూజియంలో అల్ ఖబిల్ విలాయత్, ఒమన్ సంప్రదాయాలను ప్రతిబింబించే వంద కంటే ఎక్కువ కళాఖండాలు ఉన్నాయి. దివంగత సుల్తాన్ ఖబూస్ తల్లి పేరు(బైట్ ముజ్నా) మీద ఉన్న ఈ మ్యూజియం ఇప్పుడు అల్ ఖబిల్లో పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా మారింది. ఎగ్జిబిట్లలో పుస్తకాలు, నాణేలు, వంటగది పాత్రలు, హస్తకళలు, మాన్యుస్క్రిప్ట్ లు, వెండి వస్తువులు, కంకణాలు, కుండలు, మండూస్ పెట్టెలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ వారసత్వాన్ని కాపాడటంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని అన్నారు. ఆమె ప్రయత్నాలను ఒమన్లోని పాలస్తీనా రాయబారితో సహా చాలా మంది ప్రశంసించారు. మ్యూజియంలోని కొన్ని భాగాలను ప్రదర్శించడానికి చిల్డ్రన్ ఫస్ట్ అసోసియేషన్ ఆమెకు ఇటీవల ముగిసిన మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లోని స్టోర్లో స్థలాన్ని కేటాయించింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







