దుబాయ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న 'ఘోస్ట్'..
- March 10, 2022
దుబాయ్: అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఘోస్ట్. ప్రస్తుతం ఈ మూవీ షెడ్యూల్ దుబాయ్‌లో శరవేగంగా సాగుతోంది. ఇటీవల బంగార్రాజు మూవీతో వచ్చి హిట్ అందుకున్న నాగ్ ఇప్పుడు ఆ సినిమాకు పూర్తి భిన్నమైన కాన్సెప్ట్‌తో 'ఘోస్ట్' చేస్తున్నారు. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా సోనాల్ చౌహాన్ నాగ్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. క్రేజీ థ్రిల్లర్ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ ఫస్ట్ లుక్ తోనే అంచనాలు రేపింది. ఇప్పటికే కొంత టాకీపార్ట్ పూర్తి చేసుకోగా ఇప్పుడు దుబాయ్‌లో హీరో హీరోయిన్స్‌పై కీల సన్నివేశాలను అలాగే సాంగ్‌ను కంప్లీట్ చేస్తున్నారట.తాజాగా దీనికి సంబందించిన ఓ పిక్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనిలో నాగార్జున, సోనాల్ చౌహాన్‌లతో పాటు దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఉన్నారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!







