రెండు అవార్డులను గెలుచుకున్న సలాలా ఎయిర్ పోర్ట్

- March 11, 2022 , by Maagulf
రెండు అవార్డులను గెలుచుకున్న సలాలా ఎయిర్ పోర్ట్

ఒమన్: సలాలా ఎయిర్ పోర్ట్ 2021లో రెండు అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో ప్రయాణీకుల ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) ఈ అవార్డులను అందజేస్తుంది.  "నాణ్యమైన సేవల్లో మధ్యప్రాచ్యంలో అత్యుత్తమ ఎయిర్ పోర్ట్, సంవత్సరానికి రెండు మిలియన్ల కంటే తక్కువ ప్రయాణీకులు ఉన్న విమానాశ్రయాల విభాగంలో" సలాలా ఎయిర్ పోర్ట్ మొదటి అవార్డు అందుకున్నది. రెండవ అవార్డు "కోవిడ్-19 మహమ్మారి సమయంలో హెల్త్ ప్రమాణాలు మెయింటనెన్స్ మధ్యప్రాచ్యంలో అత్యుత్తమ విమానాశ్రయం" విభాగంలో సొంతం చేసుకుంది.  370,000 కంటే ఎక్కువ మంది కస్టమర్ల నుండి ACI డేటా సేకరించి, 37 పనితీరు సూచికల ద్వారా విశ్లేషించి అవార్డులను అందజేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com