దుబాయ్ లో టాక్సీ డ్రైవర్ల రిక్రూట్ మెంట్

- March 11, 2022 , by Maagulf
దుబాయ్ లో టాక్సీ డ్రైవర్ల రిక్రూట్ మెంట్

యూఏఈ: దుబాయ్‌లోని రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (RTA) మార్చి 11 నుండి టాక్సీ డ్రైవర్‌ ల రిక్రూట్ మెంట్ నిర్వహిస్తుంది. నెలకు Dh2,000 వరకు జీతం, ఇతర ప్రోత్సాహకాలను అందిస్తోంది. అభ్యర్థులు రెండు నుండి ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి. ఫుల్ టైం/పార్ట్ టైం అవకాశాలు మేల్/ఫీమేల్ లకు అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగం కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూలు మార్చి 11-18 తేదీల్లో నిర్వహించబడతాయి. కాబట్టి దరఖాస్తు చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ప్రివిలేజ్ లేబర్ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ M-11, అబు హేల్ సెంటర్, దీరా, ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య సందర్శించాలి. హాజరు కాలేని అభ్యర్థులు తమ CVలను [email protected]కు పంపవచ్చు లేదా 055-5513890కి WhatsApp చేయవచ్చు. 23 - 55 మధ్య వయస్సు గల అభ్యర్థులు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలని అథారిటీ కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులకు Dh2,000 జీతం, కమీషన్, ఆరోగ్య బీమా, వసతి అందించబడుతుంది. దుబాయ్ డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా రిక్రూట్ మెంట్ ప్రక్రియలో అనుమతి ఇస్తారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR)లో భాగంగా RTA తక్కువ-ఆదాయ వర్గానికి 2021లో ఉచితంగా డ్రైవింగ్ శిక్షణను అందించిన విషయం తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com