దొంగతనాల నుంచి ఇంటికి ఇన్స్యూరెన్స్‌

- April 01, 2016 , by Maagulf
దొంగతనాల నుంచి ఇంటికి ఇన్స్యూరెన్స్‌

యూఏఈలో 1 శాతం కంటే తక్కువ ఇళ్ళకే, తమ ఇంట్లోని విలువైన వస్తువులకు సంబంధించిన ఇన్స్యూరెన్స్‌ ఉందని ఓ ఇన్స్యూరెన్స్‌ సంస్థ వెల్లడించింది. దొంగతనాల కారణంగా విలువైన వస్తువల్ని కోల్పోతే అది ఆ కుటుంబంపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతాయనీ, అలాంటి సందర్భాల్లో ఇన్స్యురెన్స్‌ వారికి అండగా నిలుస్తుందని సంస్థ ప్రతినిథులు చెప్పారు. ఇంటిని మాత్రమే కాకుండా, ఇంట్లోని వస్తువుల్ని కూడా ఇన్‌స్యూర్‌ చేసుకోవడం మంచిదనీ, ఈ విషయంలో తాము ఎంతగా అవగాహనా కార్యక్రమాలు చేపడ్తున్నా, వినియోగదారులు పెద్దగా పట్టించుకోవడంలేదనీ మెనా రిటైల్‌, ఖతార్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫ్రెడ్రిక్‌ బిస్‌బ్‌జెర్గ్‌ చెప్పారు. ఇదిలా ఉండగా, తమ ఇళ్ళు దోపిడీకి గురి కాకుండా, తాము ఇంట్లో లేనప్పుడు సన్నిహితులు, బంధువులు, లేదా సమీపంలో ఉండే స్నేహితుల్ని అప్పుడప్పుడూ తమ ఇంటిని గమనించాల్సిందిగా సూచించాలి. లాక్‌ చేసే సమయంలో అన్నీ సరిగ్గా చూసుకోవాలి. అలాగే భద్రతా ఏర్పాట్లు ముఖ్యం. ప్రధానంగా ఇంట్లో పనిచేసేవారితో దొంగలు సఖ్యంగా ఉంటారు. పని మనుషుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com