స్పెషల్ ప్లాన్ అంటూ అడివి శేష్ ‘మేజర్’ అప్డేట్
- March 12, 2022
హైదరాబాద్: మేజర్ అనే ఆసక్తికరమైన సినిమాతో ప్రామిసింగ్ యాక్టర్ అడివి శేష్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ హీరోయిన్లుగా నటించారు. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, జిఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ+ఎస్ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఎట్టకేలకు మే 27న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనాతో పాటు పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండడంతో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలను స్టార్ట్ చేయలేదు. అయితే అడివి శేష్ మాత్రం మేజర్ కు సంబంధించిన ఏదో ఒక వార్తతో ప్రేక్షకుల దృష్టిని తన వైపుకు తిప్పుకుంటున్నాడు.
తాజాగా అడివి శేష్ స్పెషల్ ప్లాన్ చేస్తున్నాము అంటూ చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. మార్చి 15న బిగ్ అప్డేట్ రాబోతున్నట్లు ప్రకటించారు. “మార్చి 15న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పుట్టినరోజు. లెజెండ్ జన్మదినోత్సవం సందర్భంగా మేము ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నాము :)” అంటూ అడివి శేష్ పోస్ట్ చేశాడు. ఆయన తాజా ట్వీట్ తో సినిమా ప్రేమికులు చిత్ర బృందం ఏదైనా క్రేజీగా రివీల్ చేసే అవకాశం ఉందని ఊహించడం ప్రారంభించారు.
March 15 is the birth anniversary of #MajorSandeepUnnikrishnan . On the Legend’s birth anniversary , We have something special planned :)
— Adivi Sesh (@AdiviSesh) March 12, 2022
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







