సిమ్లా మిర్చి గ్రేవీ
- June 10, 2015
కావలసిన పదార్ధాలు:
- కాప్సికమ్ - 3 (పెద్దవి)
- పల్లీలు - 1/4 కప్పు
- తెల్ల నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర - 2 టీ స్పూన్లు
- చింతపండు - నిమ్మకాయంత
- ఉప్పు - సరిపడా
- పసుపు - 1 టీ స్పూను
- కారం - 1 టీ స్పూను
- ధనియాల పొడి - 1 టీ స్పూను
- జీలకర్ర పొడి - 1 టీ స్పూను
గ్రేవీ కోసం:
- ఉల్లిపాయ - 1
- టొమాటోలు - 3
- అల్లం - అంగుళం ముక్క
- వెల్లుల్లి - 4 రెబ్బలు
- కొబ్బరి - 2 టేబుల్ స్పూన్లు
తాలింపు కోసం:
- ఆవాలు - 1 టీ స్పూను
- మెంతులు - 1/2 టీ స్పూను
- ఉల్లి గింజలు - 1 టీ స్పూను
- నూనె - 1 టేబుల్ స్పూను
చేయు విధానం:
- చింతపండుని గోరువెచ్చని నీళ్ళల్లో పావుగంట నానబెట్టి గుజ్జులా చేయాలి.
- బాణీలో పల్లీలు, నువ్వులు, జీలకర్ర వేయించి పొడి చేయాలి.
- తర్వాతా గ్రేవీ కోసం తీసుకున్నవన్నీ నీళ్ళు లేకుండా మెత్తగా రుబ్బాలి.
- బాణీలో టీ స్పూను నూనె వేసి కాప్సికమ్ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి నాలుగైదు నిమిషాలు వేయించి పక్కన పెట్టండి.
- మరో బాణీలో నూనె వేసి తాలింపు చేసి, రుబ్బిన మసాలా ముద్ద వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.
- గ్రేవీ చిక్కబడ్డాక పల్లీల పొడి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్రపొడి, ధనియాలపొడి, చింతపండు గుజ్జు వేసి కలిపి అయిదు నిమిషాలు ఉడికించాలి.
- ఇప్పుడు వేయించిన కాప్సికమ్ ముక్కలు వేసి చిక్కబడేవరకూ ఉడికించి దించాలి.
----ఏ. రమణి, గుంటూర్.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







