అబుధాబి ఎక్స్‌ప్రెస్ బస్ సర్వీస్ సోమవారం ప్రారంభం
- March 12, 2022
అబుధాబి: ఎమిరేట్ వ్యాప్తంగా ర్యాపిడ్ బస్ ట్రాన్స్‌పోర్టేషన్ కోసం అబుధాబి ఎక్స్‌ప్రెస్ అనే సర్వీస్ ప్రారంభం కానుంది. సోమవారం ఈ సర్వీసు ప్రారంభమవుతుంది. డైరెక్ట్ నాన్ స్టాప్ బస్సుల్ని ప్రైవేటు రంగానికి చెందిన ఆపరేటర్లు నిర్వహిస్తారని ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ సెంటర్ - డిపార్టుమెంట్ ఆఫ్ మునిసిపాలిటీస్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ వెల్లడించింది. తొలి ఫేజ్‌లో భాగంగా ముసాఫ్ఫా ఇండస్ట్రియల్ ఏరియా మరియు మొహమ్మద్ బిన్ జాయెద్ సిటీ మధ్య బస్సులు నడుస్తాయి. రెండో ఫేజ్ విషయానికొస్తే ఖలీఫా సిటీ, బని యాస్, అల్ షమామా, అల్ ఫలాహ్ మరియు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. ఈ ప్రాంతాల్ని నేరుగా అబుదాబీతో కనెక్ట్ చేస్తారు. రెండో ఫేజ్‌లో అల్ అయిన్‌కి పలు ప్రాంతాలతో కనెక్ట్ చేస్తారు. వారంలో మొత్తం 680 ట్రిప్పులు వుంటాయి. అబుదాబీ సిటీ ప్రధాన బస్ స్టేషన్‌ని ఈ బస్సులు వినియోగిస్తాయి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బస్సులు నడుస్తాయి. ప్రతి పదిహేను నుంచి 30 నిమషాలకు ఓ బస్సు అందుబాటులో వుంటుంది.. రద్దీకి అనుగుణంగా.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







