సౌదీలో కనీస టాక్సీ ఛార్జీ SR10
- March 14, 2022
సౌదీ: పబ్లిక్ టాక్సీ ఛార్జీలను పెంచుతూ సౌదీ అరేబియా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నలుగురు ప్రయాణికుల సామర్థ్యం కలిగిన పబ్లిక్ క్యాబ్‌లలో SR10ని కనీస ఛార్జీగా నిర్ణయించింది. కొత్త ధర ప్రకారం.. బేస్ ఫేర్ కంటే ప్రతి అదనపు కిలోమీటరుకు చార్జీ SR2.1 కి(16.67 శాతం) పెరిగింది. ఇది అంతకుముందు SR1.8 గా ఉండేది. వెయిటింగ్ ఛార్జీ కూడా నిమిషానికి 12.5 శాతం పెరిగింది. కొత్త ఛార్జీలు SR0.8కి బదులుగా SR0.9గా ఉంటాయి. వాహనం వేగం గంటకు 20 కి.మీ కంటే తక్కువ ఉంటే అదే ఛార్జీలను వసూలు చేయవచ్చు. మీటర్ ఓపెనింగ్ ఛార్జీ 16.36 శాతం పెరిగింది. SR5.5కి బదులుగా SR6.4కి చేరుకుంది. ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణీకుల సామర్థ్యం కలిగిన ట్యాక్సీలకు సంబంధించి, ప్రారంభ ఛార్జీలలో 21.67 శాతం పెరుగుదల నమోదైంది. కొత్త ధరను SR6కి బదులుగా SR7.3కి ఉన్నాయి. వెయిటింగ్ ఛార్జీ విషయానికొస్తే ప్రతి నిమిషానికి SR0.9కి బదులుగా SR1.1కి 22.22% పెంచారు.
తాజా వార్తలు
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం







