ఒమన్, ఖతార్ కార్మిక మంత్రులు భేటీ
- March 15, 2022
మస్కట్: ఖతార్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ అలీ సెయిద్ సమీఖ్ అల్ మర్రీ ప్రతినిధి బృందం నిన్న కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మహద్ సయిద్ బావోయిన్‌ను తన కార్యాలయంలో సమావేశమయ్యారు. లేబర్ మార్కెట్, హ్యూమన్ రిసోర్స్ (హెచ్‌ఆర్) అభివృద్ధి, ఇతర సహకార రంగాలకు సంబంధించిన వివిధ రంగాలలో సంబంధాలను పెంపొందించే మార్గాలపై ఇరు దేశాల నేతలు సమావేశంలో చర్చించారు. ఎంప్లాయ్ మెంట్ పరంగా ఒమన్ సుల్తానేట్‌లో కార్మిక మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలను కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో వేతన రాయితీ, లేబర్ సెక్యూరిటీ, ట్రైనింగ్.. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో రిక్రూట్ మెంట్, స్థానికీకరణ రేట్లు అభివృద్ధి దశలపై అభిప్రాయాలను పంచుకున్నారు. సేఫ్ గైడ్ లైన్స్, వృత్తిపరమైన వెల్నెస్‌తో పాటు ఉద్యోగ స్థానికీకరణ, ట్రైనింగ్ రంగంలో ఒమానీ అనుభవాన్ని ఖతార్ ప్రతినిధి బృందానికి వివరించారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ అండర్ సెక్రటరీలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







