సౌదీ అరేబియాలో తగ్గనున్న ఉష్ణోగ్రతలు

- March 15, 2022 , by Maagulf
సౌదీ అరేబియాలో తగ్గనున్న ఉష్ణోగ్రతలు

రియాద్: సౌదీ అరేబియాలోని చాలా ప్రాంతాలలో ఈ వారం చివరి వరకు ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ (NCM) ప్రకటించింది. మంగళవారం నుండి శుక్రవారం వరకు రాజ్యంలోని చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని NCM  తెలిపింది. తబుక్, ఉత్తర సరిహద్దు, హేల్, అల్-జౌఫ్ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల కంటే తక్కువగా చేరుతాయని పేర్కొంది. ఉత్తర ప్రాంతంలోని ఉష్ణోగ్రతల తగ్గుదల ప్రభావం అల్-ఖాసిమ్, అల్-షార్కియా, రియాద్ ప్రాంతాలకు విస్తరిస్తుందని, దాంతో కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలకు చేరుకుంటుందని చెప్పింది. మంగళవారం నుంచి మక్కా, తబుక్, మదీనా, అల్-జౌఫ్, హైల్, ఉత్తర సరిహద్దులు, అల్-ఖాసిమ్ ప్రాంతాల్లో దుమ్ము, ధూళితో కూడిన ఈదురు గాలులు వీస్తాయని NCM  తెలిపింది. ఇది క్రమంగా బుధ, గురువారాల్లో తూర్పు ప్రావిన్స్, రియాద్‌ వరకు విస్తరిస్తుందని పేర్కొంది. ఈ సమయంలో గాలి వేగం గంటకు 50 కి.మీ కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పింది. దీని ప్రభావం గురువారం, శుక్రవారం మక్కా, నజ్రాన్, అసిర్, అల్-బహా ప్రాంతాల తూర్పు ప్రాంతాలపై పడుతుందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com