సౌదీ అరేబియాలో తగ్గనున్న ఉష్ణోగ్రతలు
- March 15, 2022
రియాద్: సౌదీ అరేబియాలోని చాలా ప్రాంతాలలో ఈ వారం చివరి వరకు ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ (NCM) ప్రకటించింది. మంగళవారం నుండి శుక్రవారం వరకు రాజ్యంలోని చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని NCM తెలిపింది. తబుక్, ఉత్తర సరిహద్దు, హేల్, అల్-జౌఫ్ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల కంటే తక్కువగా చేరుతాయని పేర్కొంది. ఉత్తర ప్రాంతంలోని ఉష్ణోగ్రతల తగ్గుదల ప్రభావం అల్-ఖాసిమ్, అల్-షార్కియా, రియాద్ ప్రాంతాలకు విస్తరిస్తుందని, దాంతో కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలకు చేరుకుంటుందని చెప్పింది. మంగళవారం నుంచి మక్కా, తబుక్, మదీనా, అల్-జౌఫ్, హైల్, ఉత్తర సరిహద్దులు, అల్-ఖాసిమ్ ప్రాంతాల్లో దుమ్ము, ధూళితో కూడిన ఈదురు గాలులు వీస్తాయని NCM తెలిపింది. ఇది క్రమంగా బుధ, గురువారాల్లో తూర్పు ప్రావిన్స్, రియాద్ వరకు విస్తరిస్తుందని పేర్కొంది. ఈ సమయంలో గాలి వేగం గంటకు 50 కి.మీ కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పింది. దీని ప్రభావం గురువారం, శుక్రవారం మక్కా, నజ్రాన్, అసిర్, అల్-బహా ప్రాంతాల తూర్పు ప్రాంతాలపై పడుతుందన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







