దోహా లో అంతర్జాతీయ మాతృ బాషా దినోత్సవ వేడుక
- March 16, 2022_1647369454.jpg)
దోహా: ఆంధ్ర కళా వేదిక ఖతార్ వారి అంతర్జాతీయ మాతృ బాషా దినోత్సవ వేడుక
తెలుగు బాషా అభివృద్ధి మరియు పరిరక్షణలో భాగంగా ప్రతి ఏటా నిర్వహించుకుంటున్న అంతర్జాతీయ మాతృ బాషా దినోత్సవ కార్యక్రమాన్ని “ఆంధ్ర కళా వేదిక” వారు 21-ఫిబ్రవరి-2022 (సోమవారం) ICC అశోకా హాల్లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఐసిసి ప్రెసిడెంట్ పిఎన్ బాబు రాజన్, జనరల్ సెక్రటరీ కృష్ణ కుమార్, ఐసిసి అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ కె.ఎస్ ప్రసాద్ మరియు ఐసిబిఎఫ్ నుంచి రజనీ మూర్తి వంటి పలువురు ప్రముఖులతో పాటుగా ఇతర ప్రముఖ తెలుగు సంఘాల అధ్యక్షులు మరియు వారి కార్యవర్గ బృందం సభ్యులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆంధ్ర కళా వేదిక యొక్క కార్యనిర్వాహక వర్గాన్ని వారితో పాటు పాల్గొన్న వారందరినీ అభినందించారు.
ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఖతార్ లోని తెలుగు వారి నుండి అపూర్వమైన స్పందన లభించిందని, తెలుగు వారందరిలో మాతృభాష పట్ల అభిమానాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో తమ కార్యవర్గ బృందం చేసిన కృషి ఫలించిందని పేర్కొన్నారు.యువతలో మరియు పెద్దలలో మాతృ భాష పట్ల స్ఫూర్తిని పునరుజ్జీవింపజేసే విధంగా 3 రోజుల ముందుగా అందరికి పోటీలు(చిట్టి గీతాలు, పద్యాలు, శతకాలు, ప్రముఖ వ్యక్తుల పై ప్రసంగాలు, సామెత సమేత కధలు మొదలుగునవి..) నిర్వహించటం జరిగిందని, పోటీలలో 2 1/2 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయసు వరకు అభ్యర్థులు పాల్గొని కార్యక్రమాన్ని మరింత ఉత్సాహవంతంగా మలిచారని చెప్పారు.
“కార్యక్రమంలో చిన్నారుల అద్భుతమైన ప్రదర్శనలు(ఏకపాత్రాభినయం, నృత్యాలు, పాటలు), తెలుగు బాషా బోధనా ఉపాధ్యాయులను మరియు న్యాయనిర్ణేతలను వేదికపై సన్మానించటం ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.” పోటీలలో విజేతలుగా నిలిచినవారికి మరియు పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలు మరియు బహుమతులను అందజేయటం జరిగింది. కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా శిరీష మరియు సుధ వ్యవహరించగా, ప్రధాన కార్యదర్శి శ్రీ విక్రమ్ సుఖవాసి ముగింపు సందేశంతో కార్యక్రమం ముగించారు.ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించుకోటానికి సహకరించిన దాతలకు(స్పాన్సర్స్)కి, న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఉపాధ్యాయులకు, స్వచ్ఛంద సేవకులు(వాలంటీర్స్)కి, ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!