F1 తో పెరిగిన హోటల్ ఆక్యుపెన్సీ రేట్లు

- March 20, 2022 , by Maagulf
F1 తో పెరిగిన హోటల్ ఆక్యుపెన్సీ రేట్లు

బహ్రెయిన్: F1 ఫార్ములా వన్ రేస్ కారణంగా హోటల్ ఆక్యుపెన్సీ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. F1 రేసును చూసేందుకు వివిధ దేశాల నుంచి వస్తున్న అభిమానులతో హోటల్స్ కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా ఫార్ములా వన్ అభిమానులకు హోటల్స్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిసింది. తాజా అంచనాల ప్రకారం కొన్ని హోటళ్లలో ఆక్యుపెన్సీ రేటు 70% నుండి 100% వరకు చేరుకున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో గత రెండేళ్లలో హోటల్ రంగం గణనీయమైన నష్టాలను చవిచూసింది. పలు ఈవెంట్ల నిర్వహణతో పర్యాటకుల రాకతో తిరిగి ఇటీవల హోటల్స్ కలకలలాడుతున్నాయి. MMA, వెయిట్ లిఫ్టింగ్ ఇతర ఈవెంట్‌లు ఆక్యుపెన్సీ రేట్లను 80% కంటే ఎక్కువ పెంచాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com