Ramadan.. ఆహార నిల్వలపై MoCIIP సమీక్ష

- March 20, 2022 , by Maagulf
Ramadan.. ఆహార నిల్వలపై MoCIIP సమీక్ష

మస్కట్: పవిత్ర రమదాన్ మాసంలో ఆహార వస్తువుల లభ్యత, వాటి ధరల నియంత్రణపై ఉన్నత స్థాయి సమావేశం గురువారం జరిగింది. స్థానిక మార్కెట్లలో ఆహార వస్తువుల లభ్యతను పెంచే లక్ష్యంతో వాణిజ్య, పరిశ్రమ, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ (MoCIIP) దృష్టి సారించింది. ఈ సమావేశంలో ఆహార భద్రత రంగానికి సంబంధించిన పలు ప్రాధాన్యతాంశాలపై చర్చించారు. ఒమన్ గవర్నరేట్‌లోని అన్ని మార్కెట్‌లలో ఉన్న గోధుమ, బియ్యం, కూరగాయలు, నూనెల వంటి ఫుడ్ ప్రొడక్ట్స్ స్టాక్ పై సమీక్షించింది. ఈ సమావేశానికి వ్యవసాయ, మత్స్య, జలవనరుల శాఖ మంత్రి హెచ్‌ఈ డాక్టర్‌ సౌద్‌ హమూద్‌ అల్‌ హబ్సీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో, స్థానిక మార్కెట్లలో ఆహార నిల్వలను పెంచడానికి ప్రోత్సాహకాల ప్యాకేజీని ప్రకటించారు. దిగుమతి చేసుకునే అనేక ఆహార పదార్థాలకు ఉచిత ఫుడ్ రిజర్వ్ స్టోర్లను అందించడంతోపాటు ఒమానీ పోర్టుల ద్వారా దిగుమతులను సులభతరం చేసే పలు చర్యలకు ఆమోదం తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com