సౌదీ అరామ్కో వాటాదారులకు బోనస్ షేర్లు
- March 21, 2022
సౌదీ: సౌదీ అరేబియా ఆయిల్ కంపెనీ (సౌదీ అరామ్కో) తన వాటాదారులకు $4 బిలియన్ల విలువైన బోనస్ షేర్లను మంజూరు చేయనుంది. ఈ మేరకు అసాధారణ జనరల్ అసెంబ్లీకి డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసినట్టు ఆదివారం అరామ్కో ప్రకటించింది. ప్రతి వాటాదారుకు ప్రతి పది షేర్లకు ఒక బోనస్ షేర్ జారీ చేయనున్నారు. ఇది 2021 ఆర్థిక ఫలితాల తర్వాత అమలు చేయనున్నారు. కంపెనీ నికర ఆదాయం $110.0 బిలియన్లకు చేరుకుందని నివేదించింది. అరామ్కో నాల్గవ త్రైమాసిక డివిడెండ్ $18.8 బిలియన్లుగా ప్రకటించింది. 2022 మొదటి త్రైమాసికంలో చెల్లించనున్నట్లు అరామ్కో పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







