బహ్రెయిన్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం

- March 21, 2022 , by Maagulf
బహ్రెయిన్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం

బహ్రెయిన్: ఆరవ ఎడిషన్ బహ్రెయిన్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభమైంది.  120కి పైగా స్థానిక, అంతర్జాతీయ రెస్టారెంట్లు ఇందులో పాల్గొంటున్నాయి.  అన్ని అభిరుచులకు తగిన ఆహార పదార్థాలను ఈ ఫుడ్ ఫెస్టివల్ లో ఫుడ్ లవర్స్ కు అందుబాటులో ఉండనున్నాయి. బహ్రెయిన్ ఫైనాన్షియల్ హార్బర్‌లో ప్రారంభించిన ఈ ఫుడ్ ఫెస్టివల్ ఏప్రిల్ 1 వరకు జరుగనుంది. బహ్రెయిన్ ఫుడ్ ఫెస్టివల్ ను ఈ సంవత్సరం వినోదభరితమైన వాతావరణంలో నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులందరినీ ఆకర్షించేలా పలు ప్రోగ్రామ్స్ ను రూపొందించారు. ఫుడ్ ఫెస్టివల్ కు వచ్చే వారికి మరపురాని అనుభూతిని కలిగించేలా అనేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com