గోల్డ్ ఫ్రాడ్.. 12 మంది ఆసియన్ల ముఠా అరెస్ట్
- March 21, 2022
యూఏఈ: నకిలీ బంగారాన్ని అమ్ముతున్న 12 మంది ఆసియన్ల ముఠాను షార్జా పోలీస్ నేర పరిశోధన విభాగం (CID) అరెస్టు చేసింది. షార్జా పోలీస్‌లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ ఒమర్ అహ్మద్ అబు అల్ జూద్ కేసు వివరాలను వివరించారు. నిందితులు అమాయకులకు నకిలీ బంగారు కళాఖండాలను(గోల్డ్ పూతపూసిన) అసలువిగా చెప్పి అమ్మడంలో సిద్ధహస్తులన్నారు. పైగా అనుమానం రాకుండా నకిలీ బంగారాన్ని వివిధ నగరాల్లో అమ్మేవారన్నారు. వీరిపై అనేక ఫిర్యాదులు అందాయని, విచారించి నిందితులను అరెస్ట్ చేశామన్నారు. నేరస్తులు మొదట్లో స్టోర్లను సందర్శించే వ్యక్తులకు తక్కువ ధరలకు మొబైల్ ఫోన్లను విక్రయించేవారన్నారు. ఇదే సమయంలో ఇస్లామిక్ శాసనాలు ఉన్న ఫేక్ బంగారు ముక్కల నమూనాలను తయారు చేయించి తక్కువ ధరలకు అమ్మారని, కొనేలా బాధితులను నిందితులు నమ్మించేవారన్నారు. అనంతరం వీరి మోసాన్ని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించగా.. నిందితులను అరెస్ట్ చేశామన్నారు. మోసానికి పాల్పడినట్టు నిందితులు అంగీకరించారని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేశామన్నారు. ఇలాంటి మోసాలపై జాగ్రత్తగా ఉండాలని, లైసెన్స్ లేని వ్యక్తుల దగ్గర వస్తువులను కొనవద్దని అబూ అల్ జూద్ ప్రజలకు పిలుపునిచ్చారు. మోసాలకు పాల్పడే వారి సమాచారం తెలిస్తే స్మార్ట్ యాప్, షార్జా పోలీస్ వెబ్సైట్ http://www.shjpolice.gov.ae లేదా హాట్‌లైన్ 80040 లో ఫిర్యాదు చేయాలని కోరారు.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







