దొంగతనం కేసులో 10మందికి జైలు శిక్ష, జరిమానా

- March 21, 2022 , by Maagulf
దొంగతనం కేసులో 10మందికి జైలు శిక్ష, జరిమానా

యూఏఈ: దొంగతనం కేసులో 10 మందికి దుబాయ్ క్రిమినల్ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. పది మందీ కలిసి 150,000 దిర్హాములు జరిమానా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. జైలు శిక్ష పూర్తయ్యాకా నిందితుల్ని దేశం నుంచి బహిష్కరిస్తారు. ఓ వాహన నిర్వహణ సంస్థలో పని చేస్తున్న వ్యక్తిని ప్రధాన నిందితునిగా గుర్తించారు. ఓ పెట్రోల్ స్టేషన్‌లో పని చేస్తున్న తొమ్మిది మంది కార్మికులతో కలిసి అక్రమంగా రీఫిల్ లావాదేవీలు నిర్వహించారు. ఇందుకు గాను ఆ తొమ్మిది మందికి కొంత వాటా చెల్లించేవాడు. కంపెనీ, ఆడిటర్ అనుమానంతో అకౌంట్లు పరిశీలించగా మోసం బయటపడింది. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ నేరాన్ని గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com