ముంబై మెట్రోలో ఉద్యోగాలు..
- March 21, 2022
ముంబై: ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పలు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ భర్తీ చేసే పోస్టుల గురించి చూస్తే.. ఈ నోటీఫికేషన్ ద్వారా మొత్తం 27 పోస్టులను భర్తీ చేస్తున్నారు. పోస్టుల వివరాలను చూస్తే.. 5 అసిస్టెంట్ జనరల్ మేనేజర్, 2 అసిస్టెంట్ మేనేజర్, 2 డిప్యూటీ ఇంజనీర్, 1 జూనియర్ సూపర్వైజర్, 16 జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ (IT) 1 పోస్ట్ ఇందులో వున్నాయి. నోటీఫికేషన్ ని పూర్తిగా చూసి వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ పోస్టులకి అప్లై చెయ్యడానికి చివరి తేదీ 15 ఏప్రిల్ 2022. కనుక ఈలోగా అప్లై చేసుకోవడం మంచిది. అప్లై చేసుకోవాలనుకునే వారు అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి అని తెలిపారు. ఇక ఇది ఇలా ఉంటే ఫారమ్‌ను డౌన్లోడ్ చేసాక అవసరమైన సమాచారాన్ని కూడా నింపాల్సి వుంది. అలానే అవసరమైన పత్రాలను జతచేయాలి. సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలవడం జరుగుతుంది. అలా ఎంపిక చేస్తారు.
ఇక దరఖాస్తు ఎలా చేసుకోవాలి అనేది చూస్తే.. డిప్యూటీ జనరల్ మేనేజర్ (HR), ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, MMRCL-లైన్ 3 ట్రాన్సిట్ ఆఫీస్, E. బ్లాక్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్, బాంద్రా (తూర్పు) ముంబై-400051కి పంపించాలి. పూర్తి వివరాలను https://www.mmrcl.com/ లో చూడచ్చు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







