బోయిగూడ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా - కేసీఆర్
- March 23, 2022
సికింద్రాబాద్ బోయిగూడ ఘటనపై.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 11 మంది సజీవ దహనం కావడంపై విచారం చెందారు.
బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు.. 5 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని సీఎం కేసీఆర్ ప్రటించారు.
ప్రమాదంలో చనిపోయిన వారి పార్థివ దేహాలను.. వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని తెలిపారు. మరోవైపు.. ప్రధాని మోదీ సైతం కేంద్ర ప్రభుత్వం తరఫున.. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు.
ఇక.. ఘటనా స్థలాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. బాధితులను ఆదుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా.. అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ సైతం.. ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదంలో మృతులను గుర్తించామన్నారు. ఘటనపై దర్యాప్తు చేయిస్తున్నామని.. చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







