మ‌హిళ‌ల‌కు అన్యాయం జరిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు: సీఎం జ‌గ‌న్

- March 23, 2022 , by Maagulf
మ‌హిళ‌ల‌కు అన్యాయం జరిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు: సీఎం జ‌గ‌న్

అమరావతి: సీఎం జగన్ ఈ రోజుమరో 163 దిశ పెట్రోలింగ్‌ వాహనాలను అసెంబ్లీ ప్రాంగణం నుంచి ప్రారంభించారు. మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నామ‌ని, 1.16 కోట్ల మంది మ‌హిళ‌లు దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు అన్యాయం జరిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే దిశ పోలీస్‌స్టేషన్లలో 900 ద్విచక్రవాహనాలు ఉన్నాయని జ‌గ‌న్ వివ‌రించారు.


 
అంతేగాక‌, 3,000కు పైగా ఎమర్జెన్సీ వాహనాలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. జ‌గ‌న్ ప్రాంభించిన పెట్రోలింగ్‌ వాహనాలు జీపీఎస్‌ ద్వారా కంట్రోల్‌ రూమ్‌కి అనుసంధానమై ఉంటాయి. మ‌హిళ‌లు ప్ర‌మాదంలో ఉంటే పట్టణాల్లో 5 నిమిషాల్లో, గ్రామాల్లో 10 నిమిషాల్లో దిశ సిబ్బంది స్పందిస్తారు. ఈ వాహనాల కోసం రూ.13.85 కోట్లు ఖ‌ర్చు చేశారు. అలాగే, బాధిత‌ మ‌హిళల విశ్రాంతి గ‌దుల కోసం రూ.5.5 కోట్ల వ్యయం జ‌రిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com