మహిళలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు: సీఎం జగన్
- March 23, 2022
అమరావతి: సీఎం జగన్ ఈ రోజుమరో 163 దిశ పెట్రోలింగ్ వాహనాలను అసెంబ్లీ ప్రాంగణం నుంచి ప్రారంభించారు. మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నామని, 1.16 కోట్ల మంది మహిళలు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే దిశ పోలీస్స్టేషన్లలో 900 ద్విచక్రవాహనాలు ఉన్నాయని జగన్ వివరించారు.

అంతేగాక, 3,000కు పైగా ఎమర్జెన్సీ వాహనాలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. జగన్ ప్రాంభించిన పెట్రోలింగ్ వాహనాలు జీపీఎస్ ద్వారా కంట్రోల్ రూమ్‌కి అనుసంధానమై ఉంటాయి. మహిళలు ప్రమాదంలో ఉంటే పట్టణాల్లో 5 నిమిషాల్లో, గ్రామాల్లో 10 నిమిషాల్లో దిశ సిబ్బంది స్పందిస్తారు. ఈ వాహనాల కోసం రూ.13.85 కోట్లు ఖర్చు చేశారు. అలాగే, బాధిత మహిళల విశ్రాంతి గదుల కోసం రూ.5.5 కోట్ల వ్యయం జరిగింది.



తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







