ఎస్ఎంఈలను ప్రోత్సహిస్తున్న లులు గ్రూప్
- March 24, 2022
మనామా: చిన్న మరియు మధ్యతరహా ఎంటర్‌ప్రైజెస్‌ని లులు గ్రూప్ ప్రోత్సహిస్తోందని యాక్టింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ బహ్రెయిన్ తెలిపారు. లులు గ్రూప్ తన పదవ స్టోర్‌ని బహ్రెయిన్‌లో ప్రారంభించిన నేపథ్యంలో సఫా షరీఫ్ అబ్దుల్ ఖాలిక్ మాట్లాడారు. లులు గ్రూపుతో భాగస్వామ్యం చాలా ఆనందంగా వుందని చెప్పారు. స్థానిక అలాగే ప్రాంతీయ మార్కెట్లో లులు గ్రూప్ సాధిస్తున్న అభివృద్ధి అలాగే, ఈ క్రమంలో స్థానికులకు ఉపాధి, ఉద్యోగాల కల్పన వంటి విభాగాల్లో చూపుతున్న శ్రద్ధ అభినందనీయమని అన్నారు. ఎక్స్పోర్ట్ బహ్రెయిన్, లులు గ్రూప్ సహకారంతో మెరుగైన ఫలితాలు రాబట్టగలుగుతోందని వివరించారు. హమాద్ టౌన్లో దానత్ అల్ లాజి వద్ద లులు గ్రూప్ పదవ స్టోర్ ఏర్పాటయ్యింది.
తాజా వార్తలు
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC







