విద్యార్థిని టీచర్ వేధించలేదని నిర్ధారించిన సీసీటీవీ ఫుటేజ్
- March 24, 2022
దోహా: ఓ విద్యార్థిపై టీచర్ వేధింపులకు పాల్పడ్డారనీ, ఈ క్రమంలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయనీ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత అసలు టీచర్, విద్యార్ధిపై దాడి చేయలేదని తేలింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ స్పష్టతనిచ్చింది. విద్యార్థి కావాలనే ఇదంతా చేసినట్లు విచారణలో అధికారులు నిర్ధారించారు. ఆడుకుంటున్న సమయంలో బాల్ కారణంగా జరిగిన గొడవ వల్ల విద్యార్థుల మధ్య కొట్లాట చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే గాయలయ్యాయి. ఇందులో విద్యార్థి తప్పిదమే వున్నట్లు అధికారులు గుర్తించారు. గొడవను ఆపేందుకు టీచర్ ప్రయత్నించి, ఆ విద్యార్థిని గ్రౌండ్ నుంచి క్లాస్ రూమ్‌కి పంపించేశారు. దీన్ని విద్యార్థి వేరే కోణంలో చూపి, టీచర్ తనపై దాడి చేసినట్లుగా ఫిర్యాదు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







