మనామా గోల్డ్ ఫెస్టివల్.. గ్రాండ్ ప్రైజ్‌గా బంగారు కడ్డీలు

- March 25, 2022 , by Maagulf
మనామా గోల్డ్ ఫెస్టివల్..  గ్రాండ్ ప్రైజ్‌గా బంగారు కడ్డీలు

బహ్రెయిన్: బహ్రెయిన్ ఓల్డ్ మనామా సౌక్‌లో నిర్వహిస్తున్న మనామా గోల్డ్ ఫెస్టివల్ లో BD5000 విలువైన భారీ బహుమతిని ప్రకటించారు. విజేతకు బంగారు కడ్డీలు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్ 20న ఈవెంట్ ముగిసే వరకు వారానికి నలుగురు చొప్పున విజేతలను ఎంపిక చేస్తామని, వారికి బంగారు నగలు లేదా వోచర్‌లను గెలుచుకునే అవకాశాన్ని కల్పించారు. పర్యటకుడు షాపింగ్ కోసం వెచ్చించే ప్రతి BD100కి ఒక లాటరీ టికెట్ అందజేస్తారు. బాబ్ అల్ బహ్రెయిన్ మాల్‌లోని టికెట్ సేకరణ కౌంటర్‌ లో లాటరీని సమర్పించడం ద్వారా డ్రాలో పాల్గొనవచ్చు. డ్రాలో విజేతలకు ఇమెయిల్ లేదా SMS ద్వారా వివరాలను తెలియజేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com