రమదాన్.. మాల్స్ లో అధికారుల తనిఖీలు

- March 25, 2022 , by Maagulf
రమదాన్.. మాల్స్ లో అధికారుల తనిఖీలు

బహ్రెయిన్‌: పరిశ్రమ, వాణిజ్యం, పర్యాటక మంత్రిత్వ శాఖ బహ్రెయిన్‌లోని అన్ని గవర్నరేట్‌లలోని వివిధ ఫుడ్ అవుట్‌లెట్‌లు, స్టోర్‌లను తనిఖీ చేసింది. రమదాన్ నెల ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పర్యవేక్షణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. మనామా మార్కెట్‌లో మూలికలు, సుగంధ ద్రవ్యాల విక్రయాలకు సంబంధించిన దుకాణాలను తనిఖీ విభాగాలు తనిఖీలు చేసినట్లు కంట్రోల్ అండ్ రిసోర్సెస్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ అబ్దుల్ అజీజ్ మహ్మద్ అలీ అల్ అష్రఫ్ తెలిపారు. ఉత్పత్తుల నాణ్య, లభ్యత, వాణిజ్య కార్యకలాపాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ తనిఖీల రమదాన్ నెలంతా కొనసాగుతాయన్నారు. పవిత్ర మాసంలో ప్రసిద్ధి చెందిన దుకాణాల్లోనూ తనిఖీలు చేపడతామన్నారు. దుకాణాలు ప్రమోషన్‌ల నియమాలు, ఉత్పత్తుల నాణ్యతకు కట్టుబడి ఉండాలని, లేదంటే నిబంధనల ప్రకారం ఆయా సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com