F1 విజిటర్స్ కోసం ఉచిత షటిల్ సర్వీసులు

- March 25, 2022 , by Maagulf
F1 విజిటర్స్ కోసం ఉచిత షటిల్ సర్వీసులు

సౌదీ: మార్చి 25 - 27 మధ్య గ్లోబల్ ఈవెంట్ ఫార్ములా 1 జరిగే రోజుల్లో సందర్శకులకు ఉచిత షటిల్ సర్వీసులను అందించనున్నట్లు జెడ్డాలోని పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కంపెనీ వెల్లడించింది. జెడ్డా మునిసిపాలిటీ, సౌదీ ఆటోమొబైల్-మోటార్ సైకిల్ ఫెడరేషన్ సహకారంతో ఫార్ములా 1 సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ లో పాల్గొంటున్నట్లు ప్రకటించింది. ఉచిత షటిల్ సర్వీసులు మధ్యాహ్నం 3 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. జెద్దాలోని అతిపెద్ద గ్లోబల్ స్పోర్ట్స్ ఈవెంట్‌కు సందర్శకులను తరలించేందుకు వీలుగా ప్రిన్స్ సుల్తాన్ స్ట్రీట్‌లో అబ్దుల్‌రహ్మాన్ అల్-దఖిల్ స్ట్రీట్ లో బస్సుల కోసం తొమ్మిది స్టాప్‌లను ఏర్పాటు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com