హంటర్‌.. ఫోర్-వీల్ డ్రైవ్ అడ్వెంచర్ వెహికల్

- March 26, 2022 , by Maagulf
హంటర్‌.. ఫోర్-వీల్ డ్రైవ్ అడ్వెంచర్ వెహికల్

బహ్రెయిన్: హంటర్ అనేది ప్రపంచంలోని మొట్టమొదటి ఆల్-టెరైన్ హైపర్‌కార్. ఇది 600 bhp, ఫోర్-వీల్ డ్రైవ్ అడ్వెంచర్ వాహనం. స్టైలిష్‌గా డిజైన్ చేయబడిన హంటర్.. అర్బన్, హైవేలలో ఉండే వారికి ఉపయుక్తంగా ఉంటుంది. ఈ హైపర్‌కారును UK బేస్డ్ ప్రోడ్రైవ్ అభివృద్ధి చేసింది. సౌదీ అరేబియాలోని డాకర్‌లో బహ్రెయిన్ రైడ్ ఎక్స్ ట్రీమ్ బృందం ఈ కారును ప్రయోగాత్మకంగా వినియోగించి సంతృప్తి వ్యక్తం చేసింది. లోబ్ ర్యాలీ వెర్షన్‌తో పోలిస్తే, హంటర్ ప్రొడక్షన్ కారు.. 3.5 లీటర్ V6 ట్విన్-టర్బో ఇంజన్ నుండి 50 శాతం ఎక్కువ శక్తిని పొందుతుంది. ఎడారి దిబ్బల మధ్య, కఠినమైన పర్వతాల ట్రాక్‌ల మధ్య మరింత సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా సస్పెన్షన్‌ను ఏర్పాటు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com