‘అజిత్ దోవల్’తో ఒమన్ ఫారిన్ మినిస్టర్ భేటీ
- March 26, 2022
న్యూఢిల్లీ: రిపబ్లిక్ ఆఫ్ ఇండియా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసాయిదీ సమావేశమయ్యారు. వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, వ్యూహాత్మక సంబంధాలపై ఈ సందర్భంగా చర్చించారు. సైనిక, భద్రతా సహకారంతో పాటు అంతరిక్ష శాస్త్రాలు, సైబర్ భద్రత, సముద్ర భద్రత, ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, పెట్టుబడి, సంస్కృతి రంగాలలో సంబంధాలపై కూడా ఇరు వర్గాలు సమీక్షించాయి. ఈ సమావేశంలో భారత్‌లోని ఒమన్ రాయబారి షేక్ హమద్ సైఫ్ అల్ రవాహి, మంత్రి కార్యాలయ విభాగాధిపతి ఖలీద్ హషీల్ అల్ ముస్లాహి, ఒమన్‌లోని భారత రాయబారి అమిత్ నారంగ్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!
- దుబాయ్లోని 2 కమ్యూనిటీలలో పెయిడ్ పార్కింగ్..డైలీ రోటిన్స్ ఎఫెక్ట్..!!
- ఒమన్ లో ఎయిర్ లిఫ్ట్..పలు వాహనాలు సీజ్..!!
- గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులను ప్రకటించిన వైట్ హౌస్..!!
- కువైట్ లో మల్టిపుల్-ట్రిప్ డిపార్చర్ పర్మిట్ ప్రారంభం..!!
- ఏపీ: పోర్టుల అభివృద్ధికి కీలక చర్యలు
- ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కుదుర్చుకున్న భారత్
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు







