'కొబ్బరిమట్ట' షూటింగ్ లో బిజీగా ఉన్న సంపూర్ణేష్‌ బాబు

- April 02, 2016 , by Maagulf
'కొబ్బరిమట్ట'  షూటింగ్ లో బిజీగా ఉన్న సంపూర్ణేష్‌ బాబు

'హృదయ కాలేయం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన నటుడు సంపూర్ణేష్‌ బాబు. ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్రం 'కొబ్బరిమట్ట' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే మరో పదిరోజుల్లో కొబ్బరిమట్ట ట్రైలర్‌ విడుదల అవుతుందని, ఇది హృదయ కాలేయం ట్రైలర్‌ను తలదన్నేలా ఉంటుందని సంపు శనివారం సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. ఎప్పటిలాగే ప్రేక్షకులు తమ ప్రేమాభిమానాలతో ట్రైలర్‌ను ఆశీర్వదించాలని కోరారు. అదేవిధంగా తనలోని నటుడ్ని ఎడిటింగ్‌లో చూసుకోండి అంటూ... ఒక ఫొటోను పోస్ట్‌ చేశారు. ఈ జన్మకి చాలనిపిస్తోందని, కొబ్బరిమట్ట తన జీవితానికి దొరికిన ఒక ఆణిముత్యమని సంపు అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com