కువైటైజేషన్.. కువైటీలకే ప్రభుత్వ ఉద్యోగాలు..!

- March 26, 2022 , by Maagulf
కువైటైజేషన్.. కువైటీలకే ప్రభుత్వ ఉద్యోగాలు..!

కువైట్‌:ఉద్యోగాల కువైటీకరణకు సంబంధించి 2017లోని CSC రిజల్యూషన్‌ నెం. 11ను పాటించాలని సివిల్‌ సర్వీస్‌ కమిషన్‌ (CSC) దాని అనుబంధ ప్రభుత్వ సంస్థలకు పిలుపునిచ్చింది. కువైట్‌ కాని వారి నియామకాన్ని కోరవద్దని చెప్పింది. కువైటైజేషన్ నిర్ణయం ప్రకారం ఉద్యోగ శాతాన్ని పెంచాలని కోరింది. ఇటీవల అవ్కాఫ్, ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి సహా వివిధ ప్రభుత్వ సంస్థల నుండి కువైటీలు కానివారి నియామకాల కోసం సీఎస్సీకి అనేక రిక్వెస్టులు వచ్చాయి. దీంతో CSC ఆయా శాఖలకు లేఖలు రాసింది. CSC నిర్ణయంలో పేర్కొన్న శాతాలను మించిన నాన్-కువైట్ నియామకం కోసం ఏదైనా రిక్వెస్ట్ చేస్తే అది ఉల్లంఘన అని CSC తన లేఖలో గుర్తు చేసింది. CSC, నిర్ణయం ప్రకారం.. కువైటైజేషన్ శాతాలను పొందే గడువు ఆగస్టు 26, 2022తో ముగుస్తుందని సూచించింది. జాతీయ కార్మిక శాతాన్ని చేరుకునే వరకు కువైట్ కాని ఉద్యోగుల సంఖ్యను ఏటా తగ్గించాలని సూచించింది. ఐదు సంవత్సరాల వ్యవధిలో ప్రభుత్వ ఉద్యోగాల్లో కువైటీలు మాత్రమే ఉండేలా చూడాలని సీఎస్సీ తన లేఖలో సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com