చైనాలో కరోనా కేసులు మళ్లీ భారీగా నమోదు
- March 26, 2022
చైనా: చైనాలో కరోనా కేసులు మళ్లీ భారీగా నమోదువుతున్నాయి.ఈ నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 56వేల కరోనా కొత్త కేసులు నమోదైనట్లు చైనా నేషనల్ హెల్త్ మిషన్ పేర్కొంది.ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా అక్కడ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అంతేకాకండా హాంకాంగ్‌లోనూ పెద్ద ఎత్తున కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. కరోనాకు కళ్లెం వేసేందుకు డైనమిక్ జీరో కొవిడ్ లక్ష్యంతో ముందుకెళ్తామని, త్వరలోనే దానిని చేరుకుంటామని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నిపుణులు తెలిపారు.
హాంకాంగ్‌లో గత నెల రోజుల్లో 200 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. ప్రతి రోజూ 10 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. చైనాలో ఇటీవల మొదలైన వేవ్ కారణంగా ఒక్క హాంకాంగ్‌లోనే ఏకంగా 10 లక్షల కేసులు నమోదుకావడం అధికారుల్లో గుబులు రేపింది. అయితే కరోనాను నియంత్రించేందుకు అన్ని వ్యూహాలు అమలు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







