ఇండియా పెవిలియన్ లో ఇండో గ్లోబల్ బ్లాక్‌చెయిన్ సమ్మిట్‌

- March 27, 2022 , by Maagulf
ఇండియా పెవిలియన్ లో ఇండో గ్లోబల్ బ్లాక్‌చెయిన్ సమ్మిట్‌

దుబాయ్: ఎక్స్ పో లోని ఇండియా పెవిలియన్ లో ఇండో గ్లోబల్ బ్లాక్‌చెయిన్ సమ్మిట్‌ లాంఛనంగా ప్రారంభమైంది. బిట్‌కాయిన్ ఇప్పుడు మిలియన్ రెట్లు వృద్ధి రేటుతో USD 69500/-కి చేరుకుంది. చాలా క్రిప్టో కరెన్సీలు చాలా తక్కువ వ్యవధిలో మిలియన్ల రెట్లు పెరిగాయి. EDUBUK, Erium Exchange, Big Bull, Bitengen Exchange ఇండియా, విదేశాల నుండి వందలాది ప్రముఖ సంస్థల సహకారంతో యూరోపియన్ డిజిటల్ యూనివర్సిటీ (USA), యూరోపియన్ బ్లాక్‌చెయిన్ సెంటర్ ద్వారా సమ్మిట్‌ను ప్రమోట్ చేయనున్నట్లు ప్రొఫెసర్ సిధిక్ ఎ ముహమ్మద్ ఛాన్సలర్ యూరోపియన్ డిజిటల్ యూనివర్సిటీ తెలిపారు. ఈ సందర్భంగా EDUBUK వ్యవస్థాపకులు అపూర్వ బజాజ్, శివానీ మల్హోత్రా మాట్లాడుతూ.. డిజిటల్ కరెన్సీ గురించిన సమాచారం ప్రపంచానికి తెలియజేసేందుకు UAE, ఇండియా, మిడిల్ ఈస్ట్ లోని మీడియా గ్రూపుల మద్దతును కోరారు. బ్లాక్‌చెయిన్ క్రిప్టో, ఎన్‌ఎఫ్‌టిలు 2025 నాటికి భారతీయ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ట్రిలియన్ డాలర్ల విలువైన అదనపు విలువను జోడిస్తాయని ఇడియు ఛైర్మన్ నీల్ సావంత్ తెలిపారు. డా.వినయ్ కుమార్ రెడ్డి సరికొండ(ఎస్వీఆర్) మాట్లాడుతూ.. లక్షలాది మంది పిల్లలకు విద్యను అందించాలని, ప్రపంచ వ్యాప్తంగా వర్చువల్ స్పేస్‌ని సృష్టించేందుకు విశ్వవిద్యాలయాలు ముందుకురావాలన్నారు. తమ కంపెనీ ద్వారా నిరుపేదలకు ఉపాధి కల్పించాలనుకుంటున్నామని చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com