పోలీసుల పెట్రోలింగ్ రికార్డ్.. వ్యక్తికి 50,000 దిర్హామ్‌లు ఫైన్

- March 28, 2022 , by Maagulf
పోలీసుల పెట్రోలింగ్ రికార్డ్.. వ్యక్తికి 50,000 దిర్హామ్‌లు ఫైన్

దుబాయ్: పోలీసుల గస్తీని రికార్డ్ చేసి, స్నేహితురాలితో వీడియో షేర్ చేసినందుకు ఓ వ్యక్తికి 50,000 దిర్హామ్‌లు జరిమానా విధించారు. 32 ఏళ్ల గల్ఫ్ దేశస్థుడికి దుబాయ్ క్రిమినల్ కోర్టు 50,000 దిర్హామ్‌ల జరిమానా విధించింది. పోలీసుల పెట్రోలింగ్‌ను చిత్రీకరించి, వీడియో క్లిప్‌ను 'స్నాప్‌చాట్' ద్వారా తన స్నేహితురాలికి పంపాడన్న అభియోగాలు నిరూపణ కావడంతో ఈ జరిమానను క్రిమినల్ కోర్టు విధించింది.  దుబాయ్‌లోని పామ్ జుమేరా ప్రాంతంలో నిందితుడు అతని ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో ఉన్నారు. ఆ సమయంలో డ్రైవర్ మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతుండగా పెట్రోలింగ్ పోలీసులు గమనించి.. ఫైన్ వేసారు. ఈ క్రమంలో కారు వెనుక సీటులో కూర్చొన్న నిందితుడు.. అసభ్యకరమైన పదాలతో పోలీసును దూషిస్తూ.. పోలీసు పెట్రోలింగ్ కారును ఫోన్‌లో రికార్డ్ చేశాడు. ఇది గమనించిన పోలీసు.. వీడియోలోని విషయాల గురించి ఆరా తీశాడు. ఫోన్ ఇవ్వడానికి కూడా నిందితుడు నిరాకరించడంతో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. కేసును సమీక్షించిన తర్వాత నిందితుడి అప్పీల్ ను కోర్టు కొట్టివేసింది. పోలీసుల రిపోర్ట్, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా కోర్టు నిందితుడికి భారీ జరిమాన విధిస్తూ తీర్పును వెలువరించింది.

--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com