దుబాయ్ ఎక్స్పో 2020: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తో సందడి చేసిన రణ్వీర్ సింగ్
- March 28, 2022
దుబాయ్: దుబాయ్ ఎక్స్పో 2020లో భాగంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, నటుడు రణ్వీర్ సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దుబాయ్ పర్యటనలో భాగంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం దుబాయ్ ఎక్స్పో 2020లో పాల్గొన్నారు. ఇండియా పెవిలియన్‌లోని ‘ది గ్లోబల్ రీచ్ ఆఫ్ ఇండియన్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ’ గురించి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. రణ్వీర్ సింగ్‌తో ప్రత్యేకంగా సంభాషించారు. ఈ సందర్భంగా మంత్రి అనురాగ్ భారతీయ సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందిన విధానంపై మాట్లాడారు. భారత్ సినిమా ఇండస్ట్రీకి పెట్టింది పేరని.. విదేశాల్లోనూ భారతీయ సినిమా సత్త చాటుతోందని పేర్కొన్నారు. సినిమా పరిశ్రమ ద్వారా ఎంతో మందికి ఉపాధి లభించిందని మంత్రి పేర్కొన్నారు.
విదేశాల్లో ఉన్న భారతీయులు దేశ ఖ్యాతిని నలుదిక్కులా చాటి చెబుతున్నారని తెలిపారు. ఇండియా పెవిలియన్ 1.7 మిలియన్ల సందర్శకులతో భారీగా కిక్కిరిసిపోయిందని తెలిపారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా వేడుకలు జరుగుతున్నాయని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. చిత్ర పరిశ్రమ విదేశీయులపై మంచి ప్రభావాన్ని చూపిందన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలో అత్యున్నత స్థానానికి చేర్చడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా రణ్వీర్ సింగ్ నటనా ప్రతిభను మంత్రి కొనియాడారు.
ఈ విషయమై రణవీర్ సింగ్ మాట్లాడుతూ.. భారతీయ సినిమా సరిహద్దులను చెరిపేస్తున్నాయని ఇతర దేశాల ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. సినిమా ఇండస్ట్రీ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. దేశ విదేశాల్లో భారత సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కాగా.. ఈ భేటీకి ముందు మంత్రి అనురాగ్ ఠాకూర్, రణ్వీర్ సింగ్‌తో కలిసి దుబాయ్ ఎక్స్పో 2020లో ఇండియా పెవిలియన్‌ను సందర్శించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!