'నేను-తెలుగుదేశం' పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు
- March 28, 2022
హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు రచించిన 'నేను-తెలుగుదేశం' అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ సాయంత్రం హైదరాబాదులో జరిగింది. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రస్థానాన్ని ఈ పుస్తకంలో వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
కాగా, తన పుస్తకంపై కంభంపాటి రామ్మోహన్ రావు స్పందిస్తూ... ఈ పుస్తకం కోసం రెండేళ్లు హోమ్ వర్క్ చేశానని వెల్లడించారు. ఎన్టీఆర్ ఏది చెబితే అది చేయడమే నాకు తెలుసు అని వివరించారు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని కొనియాడారు. కాగా, ఈ పుస్తకావిష్కరణ సభలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, టీడీపీ సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు,చింతకాయల అయ్యన్నపాత్రుడు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, మురళీమోహన్, రాఘవేంద్రరావు, అశ్వనీదత్, తెరాస తుమ్మల నాగేశ్వరావు, సిపిఐ నారాయణ, శ్రీనివాస్ రెడ్డి, రామచంద్ర మూర్తి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి
- బహ్రెయిన్ చారిత్రక ప్రాంతాల పునరుద్ధరణకు చర్యలు..!!
- ఖతార్‌లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు.. వాటర్ లైన్ నిర్వహణ పనులు..!!
- లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు







