రమదాన్ విరాళాల కోసం ఇల్లీగల్ ప్రకటనలు.. వెబ్సైట్ లు బ్లాక్
- March 31, 2022
కువైట్: కువైట్ బయటి నుండి చట్టవిరుద్ధంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం విరాళాల కోసం ప్రకటనలు చేసే వెబ్సైట్లను బ్లాక్ చేయాలని సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ అహ్మద్ అల్-ఎనేజీ పబ్లిక్ కమ్యూనికేషన్స్ అథారిటీని కోరారు. కువైట్ బయటి నుండి స్వచ్ఛంద ప్రాజెక్ట్ ల కోసం విరాళాలను అభ్యర్థిస్తూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో మంత్రిత్వ శాఖ ఇటీవల అనేక ప్రకటనలను చూసిన తర్వాత, ఆ విరాళాలను సేకరించడానికి అధికారం లేని సంస్థలు లేదా వ్యక్తుల ద్వారా ఈ చర్య తీసుకున్నట్లు అల్-ఎనెజీ వివరించారు. ఓ దేశంలో ఇస్లామిక్ కేంద్రాన్ని స్థాపించడానికి విరాళం ఇవ్వమని వివిధ సోషల్ మీడియా సైట్లలో ప్రకటనలు చేస్తున్నాయని అని అల్-ఎనెజీ తెలిపారు. ఇది ప్రజా ప్రయోజనాల కోసం డబ్బు వసూలు చేయడానికి ఉన్న లైసెన్స్ ని నియంత్రించే చట్టాన్ని ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. 1959లో ఆమోదించిన చట్టం ప్రకారం.. విదేశాలలో దాతృత్వం, ప్రజా ప్రయోజనం లేదా సహాయం కోసం ఖర్చు చేసే ఉద్దేశ్యంతో ప్రజల నుండి విరాళాలు సేకరించడానికి ఏ విధంగానూ అనుమతి లేదు. మంత్రిత్వ శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఛారిటీ సొసైటీస్, అసోసియేషన్స్‌తో అనుబంధంగా ఉన్న బృందాల ద్వారా విరాళాల సేకరణ కోసం చేసే ప్రకటనలు, ఆహ్వానాలను నిశితంగా అనుసరిస్తోందని అల్-ఎనేజీ చెప్పారు. చట్టాలు, నిబంధనలను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని అల్-ఎనేజీ స్పష్టం చేశారు. దాతల నిధులను రక్షించడంలో సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాజీపడదని, దాతృత్వం, మానవతా కార్యక్రమాలలో అగ్రగామిగా ఉన్న కువైట్ ఖ్యాతిని కాపాడుతుందని అల్-ఎనెజీ తెలిపారు.
తాజా వార్తలు
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి శిబిరం విజయవంతం..
- TGSRTC నూతన ఎండీగా వై.నాగిరెడ్డి
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్‌వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!