దుబాయ్: ఈ-స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్

- April 01, 2022 , by Maagulf
దుబాయ్: ఈ-స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్

దుబాయ్: డ్రైవింగ్ లైసెన్స్ పర్మిట్ పొందిన తర్వాతే దుబాయ్‌లో ఈ-స్కూటర్లు లేదా ఏ రకమైన బైక్‌నైనా నడపాలని అధికారులు స్పష్టం చేశారు. రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) ఇ-స్కూటర్లు లేదా ఇతర రకాల బైక్‌లకు లైసెన్స్ లను జారీ చేస్తుందని పేర్కొంది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ మరియు ది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ దుబాయ్‌లో సైకిళ్లు, ఇ-స్కూటర్ల వినియోగాన్ని నియంత్రిస్తూ ఒక తీర్మానాన్ని జారీ చేయడం తెలిసిందే. దీనికి అనుగుణంగా RTA ఉత్తర్వులు జారీ చేసింది. తీర్మానం ప్రకారం.. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న సైక్లిస్టులు 18 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దవారితో పాటు ఉండాలి. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఇ-స్కూటర్‌ను నడపడానికి అనుమతి లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com