ఎక్స్ పో 2020లో బెస్ట్ పెవిలియన్ గా సౌదీ

- April 01, 2022 , by Maagulf
ఎక్స్ పో 2020లో బెస్ట్ పెవిలియన్ గా సౌదీ

సౌదీ: ఎక్స్ పో 2020 దుబాయ్‌లో సౌదీ అరేబియా పెవిలియన్ విజేతగా నిలిచింది. సౌదీ పెవిలియన్ ఎక్స్ పో 2020 దుబాయ్‌లో లార్జ్ సూట్‌ల విభాగంలో బెస్ట్ పెవిలియన్‌ అవార్డును పొందింది. అలాగే ఎగ్జిబిటర్ మ్యాగజైన్ నుండి ఉత్తమ ఔటర్ డిజైన్, ఉత్తమ ప్రదర్శనకు గౌరవ పురస్కారాలను కూడా అందుకుంది. ఎన్నో విశేషాలు ఉన్న సౌదీ పెవిలియన్ ను చూసేందుకు సందర్శకులు ఆసక్తి కనబరిచారు. సౌదీ పెవిలియన్, UAE తర్వాత రెండవ అతిపెద్దది. ఎక్స్ పో 2020 దుబాయ్‌లో అత్యంత స్థిరమైన నిర్మాణాలలో ఒకటి. దీనికి U.S. గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (USGBC) నుండి LEED వెర్షన్ 4 ప్లాటినం రేటింగ్ లభించింది. ఇది ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ డిజైన్‌లో లీడర్‌షిప్‌లో అంతర్జాతీయంగా అత్యధిక గుర్తింపు పొందిన సుస్థిరత రేటింగ్ కావడం గమనార్హం. పెవిలియన్ అతిపెద్ద ఇంటరాక్టివ్ లైటింగ్ ఫ్లోర్, పొడవైన ఇంటరాక్టివ్ వాటర్ ఫీచర్, అతిపెద్ద LED ఇంటరాక్టివ్ డిజిటల్ మిర్రర్ స్క్రీన్ లతో మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డులను నమోదు చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com