ఫేక్ RT-PCR రిపోర్టులు.. ప్రైవేట్ హెల్త్ ఇనిస్టిట్యూట్ సస్పెండ్

- April 01, 2022 , by Maagulf
ఫేక్ RT-PCR రిపోర్టులు.. ప్రైవేట్ హెల్త్ ఇనిస్టిట్యూట్ సస్పెండ్

ఒమన్ : ఫేక్ RT-PCR నివేదికలను ఫోర్జరి చేసిన ఒక ప్రైవేట్ హెల్త్ ఇనిస్టిట్యూట్ ని ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MOH) సస్పెండ్ చేసింది.  ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ప్రైవేట్ హెల్త్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ తనిఖీ బృందం ఫేక్ RT-PCR రిపోర్టులను గుర్తించింది. వీటిని ఒక ప్రైవేట్ ఆరోగ్య సంస్థ తయారు చేసినట్లు తన విచారణలో గుర్తించింది. దాంతో ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని  ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది.  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ప్రైవేట్ హెల్త్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ నివేదిక ఆధారంగా సదరు హెల్త్ ఇనిస్టిట్యూట్ నిబంధనలను ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలడంతో ఆ సంస్థను సస్పెండ్ చేసి తదుపరి విచారణకు MOH ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com