అజ్మన్ లో అంగరంగ వైభవంగా జరిగిన' శ్రీనివాస కళ్యాణం'

- April 03, 2022 , by Maagulf
అజ్మన్ లో అంగరంగ వైభవంగా జరిగిన\' శ్రీనివాస కళ్యాణం\'

యూఏఈ:ప్రతి ఏటా శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభావంగా నిర్వహిస్తారు. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఈ మహాఘట్టానికి భక్తులు 2 సంవత్సరాలు దూరంకావలసి వచ్చింది. ఇక కరోనా కాస్త నెమ్మదించడటంతో యూఏఈ అధికారులు సైతం ఈ కళ్యాణమహోత్సవానికి అన్ని అనుమతులు మంజూరు చేయటంతో ఎప్పుడు ఇప్పుడా అని ఎదురుచూసిన ఆ ఏడుకొండలవాని కళ్యాణం యూఏఈ లోని అజ్మన్ లో ఉగాది పర్వదినాన  అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.

తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలను ఆ తిరుమలలో జరిగే విధంగా నిర్వహించడం గమనార్హం.సుప్రభాత సేవతో మొదలైన ఈ కళ్యాణమహోత్సవ వేడుక పంచాంగ శ్రవణం, హోమం, కళ్యాణం, ప్రసాద సేవనంతో ముగిసింది.

జ్యోతిర్విద్యాభూషణ బ్రహ్మశ్రీ డా.కాకునూరి సూర్యనారాయణ మూర్తి చే పంచాంగ శ్రవణం కావించబడింది.విచ్చేసిన భక్తులు తమ తమ రాశిఫలాలను తెలుసుకొని ఉగాది పచ్చడి సేవించటం జరిగింది.వారణాసి నుంచి సప్త ఋషులలో ఒకరైన కశ్యాప్‌ మహామణి వారసుడు అయిన అభిషేక్‌ చౌబే కూడా విచ్చేసారు.

అనంతరం పలు కీర్తనలు,భజనలు భక్తులు ఆలపించి శ్రీవారికి సంగీతసేవ చేశారు.అసంఖ్యాకంగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ వేంకేటేశ్వరుని కృపకు పాత్రులయ్యారు.అన్ని కోవిడ్ భద్రతా నియమాల మధ్య ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు నిర్వాహకులు.ఈ కార్యక్రమానికి 13,000 మంది పైగా భక్తులు విచ్చేశారని కార్యక్రమ నిర్వాహకులు కఠారు సుదర్శన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com