100,000 బహ్రెయినీ దినార్ల తిమార్ గ్రాండ్ ప్రైజ్ గెల్చుకున్న మూడేళ్ళ చిన్నారి

- April 09, 2022 , by Maagulf
100,000 బహ్రెయినీ దినార్ల తిమార్ గ్రాండ్ ప్రైజ్ గెల్చుకున్న మూడేళ్ళ చిన్నారి

బహ్రెయిన్: మార్చి నెలకుగాను మూడేళ్ళ చిన్నారి హుస్సేన్ అలి మొహమ్మద్ 100,000 బహ్రెయినీ దినార్ల తిమార్ గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఇత్‌మార్ బ్యాంక్ ఈ ప్రైజ్ అందజేసింది. 2022లో తిమార్ మొత్తంగా 1,614,000 ప్రైజ్ మనీని ప్రకటించడం జరిగింది. నాలుగు క్వార్టర్లీ గ్రాండ్ ప్రైజ్‌లు (ఒక్కోటీ 100,000), మంత్లీ సేలరీస్ 1,000 బహ్రెయినీ దినార్లు (ఏడాదిపాటు), ఇతర నెలవారీ క్యాష్ ప్రైజ్‌లు ఇందులో వున్నాయి. నేరుగా వినియోగదారులు తిమార్ అకౌంట్ తమ మొబైల్ ఫోన్ల నుంచి తెరవవచ్చు. బహ్రెయినీలు, నాన్ బహ్రెయినీలు కూడా ఖాతాలు తెరిచేందుకు వీలుంది. తమ ఖాతాల్లోని నిల్వలకు అనుగుణంగా ప్రైజ్ మనీ గెలుచుకునే అవకాశం వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com