హైదరాబాద్ లోని పబ్స్, బార్లపై ప్రత్యేక నిఘా
- April 09, 2022
హైదరాబాద్: హైదరాబాద్ లోని పబ్స్, బార్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఎక్సైజ్ కమిషనర్ పేర్కొన్నారు. పబ్, బార్ల నిర్వహకులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్, బార్లు ఇచ్చిన సమయంలో మాత్రమే నడిపించాలన్నారు.డార్క్ రూమ్స్ లో కూడా కెమెరాలు ఉండాలని సూచించారు.నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దుతో పాటు సీజ్ చేస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్‌లోని పబ్ నిర్వాహకులకు తెలంగాణ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికైనా దారికొస్తే సరి.. లేదంటే కఠిన చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడబోమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అవసరమైతే పబ్ వ్యవస్థను రద్దు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పబ్‌ల్లో డ్రగ్స్ వాడొద్దని హెచ్చరించినా మళ్లీ డ్రగ్స్ దొరికాయని చెప్పారు.
ఇకపై డ్రగ్స్‌తో దందా చేస్తే పీడీ యాక్ట్‌లు నమోదు చేస్తామంటూ మంత్రి వార్నింగ్ ఇచ్చారు. ఇకపై పబ్బుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేయాలని.. ప్రస్తుతం అలా కెమెరాలు లేని పబ్బులను మూసేసి.. కెమెరాలు ఏర్పాటు చేసిన తర్వాతే తిరిగి తెరవాలని ఆదేశించారు. ఇలా ఏర్పాటు చేసిన కెమెరాలన్నింటిని ఎక్సైజ్‌శాఖకు అనుసంధానించాలన్నారు.
ఎక్సైజ్, పోలీసులు సూచించిన నిబంధనలన్నీ పాటిస్తున్నామని చెప్పారు. ప్రతి పబ్ లో సీసీటీవీ కెమెరాలు, బౌన్సర్లను పెట్టామని తెలిపారు. పబ్ కు వచ్చే వారిని తనిఖీ చేశాకే లోపలికి అనుమతిస్తున్నామని చెప్పారు. అనుమానిత వ్యక్తులు వస్తే అధికారులకు సమాచారం అందిస్తున్నామని వెల్లడించారు.
ఒక్కరు చేసిన పనికి అందరిని నిందించడం సరైంది కాదన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు తాము కృషి చేస్తామని చెప్పారు. పబ్ లో కానిస్టేబుల్ ను ఉంచాలని మంత్రిని కోరామని తెలిపారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







