మరోసారి టాలీవుడ్ క్రికెట్..
- April 11, 2022
హైదరాబాద్: మన దేశంలో సినిమాకి, క్రికెట్ కి వీరాభిమానులు ఉంటారు. కొన్ని సందర్భాలలో ఈ రెండు కలుస్తుంటాయి కూడా. గతంలో అనేక సార్లు సెలబ్రిటీ క్రికెట్ లీగ్స్ జరిగాయి. గతంలో మన స్టార్లు వేరే సినీ పరిశ్రమలతో కలిసి ఆడారు, మన వాళ్ళే కొన్ని టీమ్స్ గా విడిపోయి ఆడారు. ఇక చారిటి కోసం అంటే మన స్టార్లు ముందుంటారు. చారిటి మ్యాచ్ లు ఎప్పుడు ఆడటానికి అయినా రెడీగా ఉంటారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా సెలబ్రిటీ లీగ్స్ అంతగా జరగట్లేదు. ఇటీవలే కొంతమంది టీవీ ఆర్టిస్టులు కలిసి క్రికెట్ ఆడారు. తాజాగా మరోసారి టాలీవుడ్ ప్రముఖులంతా బ్యాట్, బాల్ పట్టనున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ కి కెప్టెన్ గా నటుడు శ్రీకాంత్ ఉన్నారు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. ”క్రికెట్ అంటే మా అందరికీ చాలా ఇష్టం. మంచి పనుల కోసం మేం చాలా సార్లు క్రికెట్ ఆడాం. మరోసారి మరో మంచిపని కోసం క్రికెట్ ఆడబోతున్నాం. ఈ సారి అమెరికాలోని డల్లాస్‌లో క్రికెట్ ఆడనున్నాం. ఇందుకు చాలా ఆనందంగా ఉంది” అని తెలిపారు.ఈ ప్రెస్ మీట్ లో శ్రీకాంత్, తరుణ్, తమన్, ప్రిన్స్, సుధీర్ బాబు, భూపాల్.. తదితర టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్, ఎలైట్ మీడియా ఆధ్వర్యంలో అమెరికాలోని డల్లాస్‌లో టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్‌కి, యూనివర్సల్ ఎక్స్ ఎల్ జట్టుకి మధ్య సెప్టెంబర్‌లో ఛారిటీ క్రికెట్ మ్యాచ్‌ని నిర్వహించనున్నారు. అయితే ఈ యూనివర్సల్ ఎక్స్ ఎల్ జట్టుని ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా ఎంపిక చేయనున్నారు. సినీ తారలతో క్రికెట్ ఆడాలనుకునే ఎవరైనా ఈ బిడ్డింగ్‌లో పాల్గొని వారితో ఈ క్రికెట్ మ్యాచ్ ఆడొచ్చు.దీనికి సంబంధించిన వివరాలన్నీ ఈస్ట్‌వెస్ట్ ఎంటర్టైన్మెంట్.కామ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. సెప్టెంబర్ 24, 25 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.ఈ మ్యాచ్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని సేవా కార్యక్రమాల కోసం వినియోగించనున్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







