ఆచార్య ట్రైలర్ వచ్చేసింది..!
- April 12, 2022హైదరాబాద్: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ ట్రైలర్ రానే వచ్చింది.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్ర ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు మేకర్స్.. మెగా అభిమానులు కోరుకునే అన్ని హంగులూ ఈ చిత్రంలో ఉన్నట్టు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో మొదలైన చిత్ర ట్రైలర్ కన్నుల పండుగగా ఉంది. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో చిరంజీవి, చరణ్ ల మధ్య వచ్చే సీన్స్ గూస్ బంబ్స్ తెప్పిస్తున్నాయి. ఇక ట్రైలర్ లో మెగాస్టార్ చిరంజీవి ట్రైలల్లో కాస్త లేటుగా వచ్చినా... ఆయన ఎంట్రీ లేటెస్టుగా ఉంది.
టీజర్, పాటలతో సినిమా పైన ఇప్పటికే హైప్స్ పెరగగా, ట్రైలర్ తో ఆ అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పాలి. కొణిదెల, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!