తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..!
- April 12, 2022
హైదరాబాద్: నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది.ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ కేబినెట్లో నిర్ణయించిన విషయాల గురించి మీడియాకు వెల్లడించారు.ఈ సంధర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంపై మహా సంగ్రామం మొదలు పెడతామని వెల్లడించారు.ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కాలుకు వేస్తే మెడకు మెడకు వేస్తే కాలుకు వేస్తుందని ఆయన విమర్శించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కి మెదడు జ్ఞానం బుద్ధి ఉందా… సోమరిపోతు ల కేంద్రం వ్యవహరిస్తోంది కేసీఆర్ అగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకి ఉన్న స్థాయి కేంద్రానికి లేదని ఆయన మండిపడ్డారు. మతం పేరు మీద గెలిచాం.. మాకు చేతకాదు అని చెప్పొచ్చు కదా అంటూ ఎద్దేవా చేశారు.
బాయిల్డ్ రైస్ ఎగుమతి చేసి ఎగుమతి చేయలేదని అబద్ధం చెప్పారని, మాములు టైమ్ లో 67 కిలోల బియ్యం వస్తే ఎండ కాలం లో 35 కిలోలు వస్తుందన్నారు. ఆ డబ్బును కేంద్రం భరించాలి…. ఆహార భద్రత కేంద్రం బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలో తెలివి తక్కువ ప్రభుత్వం ఉందని, పెట్రోల్ ధరలు కేంద్రం పెంచి… రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలా అని ప్రశ్నించారు. బలమైన కేంద్రము బలహీన రాష్ట్రం ఉండాలన్నది ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ అని.. ఇది ఫెడరల్ సిస్టమ్ కి వ్యతిరేకమని కేసీఆర్ ధ్వజమెత్తారు.
తాజా వార్తలు
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఈ-అరైవల్ కార్డ్ సిస్టమ్
- కరూర్ తొక్కిసలాట ఘటన..స్టాలిన్ ప్రభుత్వం సంచలన వీడియో..
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్
- ఎయిర్ బస్కి ఏపీ నుంచి ఆహ్వానం...
- డ్రగ్స్ పై ఉక్కుపాదమే అంటున్న సీపీ సజ్జనార్
- ప్రార్థనా స్థలాలే టార్గెట్..కువైట్ లో టెర్రరిస్ట్ అరెస్టు..!!
- ఒమన్ లో ఇన్వెస్ట్ మెంట్స్.. FSA వార్నింగ్ అలెర్ట్..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక.. స్వాగతించిన మిడిలీస్టు, యూరోపియన్..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!