ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని సంతకాల సేకరణ ప్రారంభం
- April 12, 2022
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారి శత జయంతి వేడుకల సంవత్సర సందర్భముగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో యు.యెస్.ఏ నుండి శంకర నేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షులు బాల ఇందుర్తి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 60 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహుకులు తెలిపారు.అందులో బాగంగా సింగపూర్ నుంచి రత్న కుమార్ కవుటూరు వ్యాఖ్యాత గా 10 ఏప్రిల్ 2022 నాడు జరిగిన అంతర్జాల (Zoom) కార్యక్రమములో యు.యెస్.ఏ లో ప్రముఖ వక్త పద్మభూషణ్ డా జగదీష్ సేథ్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ ఒక తెలుగేతర వాడిగా ఘంటసాల బహుముఖ ప్రజ్ఞని తెలుసుకొని ఆశ్చర్యపోయానని, ఒక గాయకుడిగా, సంగీత దర్శకులుగా మరియు పిన్న వయస్సులోనే దేశంకోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడుగా దేశానికీ ఎంతో సేవ చేసారని, భారతరత్న పురస్కారానికి ఘంటసాల పూర్తిగా అర్హుడని తెలిపారు, ఈ సంధర్భంగా నిర్వాహుకుల చేసే ప్రయత్నాన్ని అభినందిస్తూ తన పూర్తి మద్దతుని తెలిపారు. ప్రముఖ తెలుగు సినీ దర్శకులు వి. ఎన్. ఆదిత్య మాట్లాడుతూ ఘంటసాల జీవించి ఉన్న సమయములో మేము లేకపోయిన కానీ వారి పాటల్ని విని పెరిగామని, వారి పాటల్లోని మాధుర్యం మరియు దేశభక్తిని కొనియాడారు, ఘంటసాలకి భారతరత్న ఇస్తే భారతరత్నకె గౌరవం పెరుగుతుందని అని ఘంటసాల మీద ఉన్న తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రముఖ గాయకుడు మరియు సంగీత దర్శకులు రామాచారి కోమండూరి మాట్లాడుతూ చిన్ననాటి నుంచి ఘంటసాల పాటలు విని పెరిగామని, వారి లేని లోటుని ఎవరు భర్తీ చేయలేరని అని అన్నారు. ఈ సందర్భంగా ఘంటసాల ఆలపించిన కొన్ని భక్తి పాటలను పాడి శ్రోతలను అలరించారు.
వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు చిట్టెన్ రాజు మాట్లాడుతూ...ఘంటసాల మనకు ఆణిముత్యాలాంటి పాటలు పాడి అందించడం తెలుగు వారు చేసుకున్న అదృష్టమని, వారి పాటలు వింటుంటే ఆ భగవంతుడే దిగి వచ్చి పాడినట్టుగా ఉంటుందని కొనియాడారు.
శంకర్ నేత్రాలయ ఫౌండర్ ప్రెసిడెంట్ ఎస్. వి. ఆచార్య, శంకర్ నేత్రాలయ బోర్డు సభ్యులు డా. రాజ్ మోడీ, శంకర్ నేత్రాలయ బోర్డు సభ్యులు డా.మాధురి నముడూరి తదితరుల పాల్గొని ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు, ఘంటసాల కి భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరం అని అభిప్రాయపడుతూ, ఘంటసాల కి కేంద్ర ప్రభుత్వం తగిన రీతిన గుర్తించి భారతరత్న అవార్డు తో సత్కరించాలి అని అభ్యర్ధించారు, అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలను కూడా అందరిని ఏకతాటిపై తెచ్చి భారతరత్న వచ్చేంతవరుకు అందరు సమిష్టిగా కృషి చేయాలనీ తెలిపారు. ఘంటసాలకి భారతరత్న కోసం తెలుగేతర రాష్ట్రాల వారి నుండి కూడా మద్దతు లభించడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 63 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని, ఈ టీవీ చర్చా కార్యక్రమాలకు ప్రపంచ దేశాలలోని తెలుగు సంఘాలకి అనుసంధాన కర్తగా సింగపూర్ నుండి రత్న కుమార్ కవుటూరు, న్యూజీలాండ్ నుండి శ్రీలత మగతల, ఆస్ట్రేలియా నుండి ఆదిశేషు వ్యవహరిస్తున్నారు.ఈ కార్యక్రామనికి కావలసిన సహకారాన్ని ఘంటసాల కృష్ణ కుమారి అందిస్తున్నారు.
ఈ సంధర్భంగా ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని సంతకాల సేకరణ (Signature Campaign) కార్యక్రమము వసంత నవరాత్రులు సంధర్భంగా మొదలుపెట్టామని నిర్వాహుకులు తెలిపారు, వివారాలు మీ అందరికోసం https://chng.it/nQKtBRjS
తాజా వార్తలు
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఈ-అరైవల్ కార్డ్ సిస్టమ్
- కరూర్ తొక్కిసలాట ఘటన..స్టాలిన్ ప్రభుత్వం సంచలన వీడియో..
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్
- ఎయిర్ బస్కి ఏపీ నుంచి ఆహ్వానం...
- డ్రగ్స్ పై ఉక్కుపాదమే అంటున్న సీపీ సజ్జనార్
- ప్రార్థనా స్థలాలే టార్గెట్..కువైట్ లో టెర్రరిస్ట్ అరెస్టు..!!
- ఒమన్ లో ఇన్వెస్ట్ మెంట్స్.. FSA వార్నింగ్ అలెర్ట్..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక.. స్వాగతించిన మిడిలీస్టు, యూరోపియన్..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!