వారాంతంలో తేలికపాటి వర్షాలు: వాతావరణ శాఖ
- April 13, 2022
కువైట్: వారాంతంలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న గురు, శుక్రవారాల్లో కువైట్‌లో తేలికపాటి వర్షం పడవచ్చని, కొన్నిసార్లు ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణుడు మహ్మద్ కరమ్ తెలిపారు. దేశంలో ప్రస్తుతం సరయత్ సీజన్లో ఉంది. సాధారణంగా ఈ కాలంలో వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. బుధవారం వరకు వాతావరణం మేఘావృతమై ఉంటుందని, వర్షం పడే అవకాశం ఉందని ఆయన సూచించారు. గురువారం, శుక్రవారాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని, దీనితో పాటు చురుకైన ఆగ్నేయ గాలులు వీస్తాయని మహ్మద్ కరమ్ తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







