హెరాయిన్ అక్రమ రవాణాకు యత్నించిన వ్యక్తిపై విచారణ
- April 13, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో డేట్ బాల్స్ లో డ్రగ్స్ నింపి తన లగేజీలో 96 హెరాయిన్ క్యాప్సూల్స్ ను దాచిపెట్టి రవాణాకు ప్రయత్నించిన ఆసియా వ్యక్తి కేసు హై క్రిమినల్ కోర్టులో విచారణకు వచ్చింది. కేసు వివరాలను పరిశీలించిన కోర్టు.. ఏప్రిల్ 17కు కేసు విచారణను వాయిదా వేసింది. కేసు రిపోర్టు ప్రకారం.. ఎయిర్‌పోర్టులో నిందితుడిని బ్యాగ్‌ని పరిశీలించగా, ఖర్జూరం, గింజలు, సౌందర్య సాధనాల్లో దాచిపెట్టిన చేసిన హెరాయిన్‌ను కలిగి ఉన్న 794 గ్రాముల బరువున్న 96 క్యాప్సూల్స్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ గురించి తనకు తెలియదని నిందితుడు వాదనలను అధికారులు కొట్టిపారేశారు. తన లగేజీలో నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నట్లు నిందితుడికి తెలుసని, లాభం పొందేందుకు బహ్రెయిన్‌లో పంపిణీ చేయాలనే ఉద్దేశ్యంతో వాటిని రవాణా చేసినట్లు భద్రతా వర్గాలు ఆరోపించాయి.
తాజా వార్తలు
- డొమెస్టిక్ వర్కర్ల నియామకాలపై డిజిటల్ పర్యవేక్షణ..!!
- ఒమన్ టూరిజం..సరికొత్తగా ముసాండం వింటర్ సీజన్..!!
- పోప్ లియో XIV ను కలిసిన సల్మాన్ బిన్ హమద్..!!
- కార్మికులకు సౌదీ శుభవార్త.. స్టేటస్ మార్పునకు అవకాశం..!!
- కువైట్ లో స్మగ్లింగ్ పై ఉక్కుపాదం..!!
- దుబాయ్ లో వికసించిన 150 మిలియన్ల ఫ్లవర్స్..!!
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి శిబిరం విజయవంతం..
- TGSRTC నూతన ఎండీగా వై.నాగిరెడ్డి
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..